దీపావళీ దీపావళి సాంగ్ లిరిక్స్

Lyrics Mint



దీపావళీ దీపావళి దీపావళీ దీపావళి
ఇంటింటా ఆనంద దీపావళి
ఇంటింటా ఆనంద దీపావళి
మా ఇంట మాణిక్య కళికావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి దీపావళీ దీపావళి

జిలుగుల వలువల అల్లుల్ళ తళుకు
జిలుగుల వలువల అల్లుల్ళ తళుకు కూతుళ్ళ కులుకు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు మురిసిపోతూ చిన్నలు
రంగూ మతాబుల శోభవలీ
రంగూ మతాబుల శోభవలీ

దీపావళీ దీపావళి
ఇంటింటా ఆనంద దీపావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి

చిటపట రవ్వల ముత్యాలు కురియ
చిటపట రవ్వల ముత్యాలు కురియా రత్నాలు మెరయ
తొలకరి స్నేహాలు వలుపుల వానగా
తొలకరి స్నేహాలు వలుపుల వానగా కురిసి సెలయేరుగా
పొంగే ప్రమోద తరంగావాళి
పొంగే ప్రమోద తరంగావాళి

దీపావళీ దీపావళి
దీపావళీ దీపావళి
ఇంటింటా ఆనంద దీపావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి
దీపావళీ దీపావళి
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)