పల్లవి:
పలుకరాదటే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
సముఖములో రాయబారమెందులకే
చరణం 1:
ఎరుగని వారమటే? మొగమెరుగని వారమటే! "2"
పలికిన నేరమటే? పలుకాడగ నేరవటే
ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటనే
"పలుకరాదటే"
చరణం 2:
మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు "2"
తెలుపరాదటే సూటిగా, తెరలు తీసి పరిపాటిగా "2"
"పలుకరాదటే"