ఏలె ఏలె మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్త సోకులు
ఇచ్చెయి పచ్చరు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ
||ఏలె ఏలె||
గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదల
వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికి మటికి చెనకేవు
చీటికి మటికి చెనకేవు వట్టి బూటకాలు మాని పోవే బావ
చాలు చాలు నీతోటి అహ చాలు నీ తోటి సరసాలు బావ
||ఏలె ఏలె||
కన్నుల గంటపు కవితలు గిలికేవు నా యెద చాటున మరదలా
పాడని పాటల పయితలు సరిదేవు పల్లవి పదముల దరువుల
కంటికి వంటికి కలిపేవు
కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావ
అహ పాడుకో పాట జంట పాడుకున్న పాట జజిపూదోట
||ఏలె ఏలె||