నా మనసునె నీదటే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ
నాకెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్కసారి
నీ వెంటపడె ఆశలకి చూపవ పూల దారి
చినుకల్లె చేరి వరదల్లె మారి ముంచేస్తె తేలేదెలాగ
తడి జాడలేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ
లేనిపోని సయ్యాటతో వెంటాడకె ప్రేమ
నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవిచే తెలుపనీ మధురిమ
నీ వూహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను
నీ వూపిరితో అల్లుకుని పులకరిస్తోంది నిన్ను
అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెర చాటులోని ఏకాంతమే వదులుకోవా
నువ్వు నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా
నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవిచే తెలుపనీ మధురిమ