ధినన ధినన ధినన ధినన దిరిధిరన
ధినన ధినన ధినన ధినన ధిరర ధిరన
ధినన ధినన ధినన ధినన ధిరిధిరన
హ.. ఒక మెరుపు మెరిసె నయనములో
చిరు చినుకు కురిసె హృదయములొ
మది పలుకుతున్న సమయములొ
శ్రుతి కలుపుతున్న పవనములొ
మనలో.. ఓ… మనకె… ఏ…
మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగినది
||ఒక మెరుపు||
కనులు తెరిచి నిదుర మరచి
పరుగులతొ జయిస్తు ప్రతి నిముషం
కలలు విరిసి మనసు మురిసి
అరుపులతొ జపించు ప్రతి తరుణం
ఉరుములతొ మాకు గుసగుసలె పెదవుల పిలుపులు పదనిసలె
రంగులతొ నింగి ఎదురై నిలచిన చిరుత చురుకు రగిలిన రగడలొ
||ఒక మెరుపు||
కలికి చిలకా అలక చిలికి
పొగరులతొ ఒకింత అందములె
మెరుపు తునక తలుకుమనక
కులికెనులె ఒయ్యరి చందములై
మిసమిసలనె చూచి ఎగబడితె తొలి రుస రుస చూచి పరుగెడితె
ఈ సమరములో మాది గెలుపైతే ఎద ఎగసి ఎగసి ఉరకలు ఉరికెను
||ఒక మెరుపు||