ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని సాంగ్ లిరిక్స్

Lyrics Mint



ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీ కోసమే నేననీ
కనుపాపలో రూపమే నీవని
కనిపించని భావమే ప్రేమనీ
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా ..

చిలిపి వలపు బహుశా మన కథకు మొదలు తెలుసా
దుడుకు వయసు వరస అరె ఎగిరిపడకే మనసా
మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా
వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా
నీకు సందేహమా..

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా ..

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన

మనసు కనులు తెరిచా మన కలల జడిలో అలిసా
చిగురు పెదవినడిగా ప్రతి అణువు అణువు వెతికా
మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా
మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా
ప్రేమ సందేశమా..

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీ కోసమే నేననీ
కనుపాపలో రూపమే నీవని
కనిపించని భావమే ప్రేమనీ
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)