అందమైన మనసులో ఇంత అలజడెందుకో సాంగ్ లిరిక్స్

Lyrics Mint



అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో
ఏమని చెప్పాలి నీతో
ఒక్క మాట అయినా తక్కువేమీ కాదే
ప్రేమకు సాటేదీ లేదే
రైలు బండి కూతే సన్నాయి పాట కాగా
రెండు మనసులొకటయ్యేనా
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ
కాలి మువ్వ గొంతు కలిపేనా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి
ఒడిలో చేరిందా ప్రేమా
కంటి చూపుతోనే కొంటె సైగ చేసి
కలవర పెడుతుందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమా
గాలి వాటు కాదే మైనా
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా
అందుకోవే ప్రేమ దీవెన
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)