అనగనగా ఆకాశం ఉంది సాంగ్ లిరిక్స్

Lyrics Mint




అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకె చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకే నేల చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

||అనగనగా||

వూగె కొమ్మల్లోన చిరు గాలి ఖవ్వలి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మం లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలె ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా..ఆ..ఆ
ఆ.నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి                     ||2||
నువ్వు చెవిలొచెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

||అనగనగా||

చుక్కల్లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊహ ఊరెగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటు ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా.....
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమా గంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే
నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

||అనగనగా||

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)